ETV Bharat / state

‘ప్రకృతి వనాలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది’ - ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్​రెడ్డి.. గద్వాల పట్టణంలో పర్యటించారు. మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలను ఆయన ప్రారంభించారు.

mla bandla krishna mohan reddy
mla bandla krishna mohan reddy
author img

By

Published : Apr 22, 2021, 4:48 PM IST

గత ప్రభుత్వాల్లో ఎవరూ చేయని విధంగా.. సీఎం కేసీఆర్​ ప్రకృతి వనాలను తీసుకొచ్చారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్​రెడ్డి పేర్కొన్నారు. వనాల వల్ల మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతోందని వివరించారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని 17, 20 వ వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలను ఆయన ప్రారంభించారు.

ప్రజలకు సాయంకాల సమయంలో సరదాగా కాసేపు కాలక్షేపం చేసే విధంగా పచ్చని చెట్లు సహకరిస్తున్నాయని ఎమ్మెల్యే వివరించారు. వృద్ధులకు.. వాకింగ్, యోగా, ధ్యానం చేసే విధంగా పలు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలు ఆడుకునే విధంగా పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అందరూ కృషి చేయాలి: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.