జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలో ఎల్కూరు, మల్లెందొడ్డి, కుర్తిరావుల చెరువు గ్రామాలలో రైతు వేదిక భవనాలకు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే 46 రైతు వేదిక భవనాలు నిర్మించుకోబోతున్నామని దసరా నాటికి అన్ని పూర్తి చేసి అవే భవనాల్లో సీఎం కేసీఆర్ సమక్షంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన తెలిపారు.
గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతు వేదికల సమీపంలో మొక్కలు నాటి ప్రతి ఒక్కరు మొక్కలను సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సూచించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి