వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వినూత్నంగా నిరసన చేపట్టారు. మూడో రోజు గడప గడపకు వెళ్లి పిడికెడు బియ్యం సేకరిస్తూ... నిరసన వ్యక్తం చేశారు. గద్వాల జిల్లా కేటిదొడ్డి మండల కేంద్రంలో ఆయన ఆందోళన నిర్వహించారు.
గ్రామస్థులు ఇచ్చిన పాలు, పండ్లు స్వీకరిస్తూ... రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పిడికెడు బియ్యం కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఏపీలోని రైతు సంఘం నాయకులు... ఫోన్ ద్వారా మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. కేంద్రం ఇప్పటికైనా.. రైతుల పక్షాన నిలవాలని కోరారు.
ఇదీ చదవండి: తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న ఫియట్ క్రిస్లర్