వ్యవసాయ అధికారులు టోకెన్లు జారీ చేసిన తేదిన మాత్రమే పత్తిని మార్కెటుకు తీసుకురావాలని జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ ఛైర్మన్ కె. సరిత రైతులకు సూచించారు. గద్వాలలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
సీసీఐ నియమానుసారం పత్తిని బాగా ఆరబెట్టి తక్కువ తేమతో తీసుకెళ్లి మంచి మద్దతు ధరను పొందాల్సిందిగా సరిత సూచించారు. రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత సీసీఐ సంస్థపై ఉందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తెలియజేశారు. కొంతవరకు రంగుమారిన పత్తిని సైతం కొనుగోలు చేయాల్సిందిగా కోరారు.