ETV Bharat / state

ఆలయాల ప్రాశస్త్యం తెలిపేలా క్యాలెండర్​: ఎమ్మెల్యే అబ్రహం - MLA Abraham unveiled the Jogulamba Balabrahmameshwara Swamy Calendar

జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి క్యాలెండర్​ను అలంపూర్​ ఎమ్మెల్యే అబ్రహం ఆవిష్కరించారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

MLA Abraham unveiled the Jogulamba Balabrahmameshwara Swamy Calendar
ఆలయాల ప్రశస్త్యం తెలిపేలా క్యాలెండర్​: ఎమ్మెల్యే అబ్రహం
author img

By

Published : Feb 4, 2021, 2:47 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని బాల బ్రహ్మేశ్వర దేవస్థాన అభివృద్ధికి అన్ని వేళలా కృషి చేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. దేవస్థాన క్యాలెండర్​ని ఆవిష్కరించారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ ఛైర్మన్, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో క్యాలెండర్​తో పాటు.. ఈ నెల 12నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను కూడా ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:కరోనా సంక్షోభంలోనూ తరగని కోహ్లీ బ్రాండ్ వాల్యూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.