ETV Bharat / state

కదలని పనులు..కలగానే ఆహ్లాదం - jogulamba

పురపాలికల అభివృద్ధికి ప్రతిపాదించిన పనులు ప్రాథమిక దశలోనే మగ్గుతుండటం పట్టణవాసులను ఆవేదనకు గురిచేస్తోంది. ముఖ్యంగా గద్వాల, ఐజ పట్టణాల పరిధిలో చేపట్టిన మినీ ట్యాంకుబండ్‌, పార్కుల నిర్మాణంలో ఆశించిన మేర పురోగతి ఉండటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడుస్తున్నా పనుల పరిస్థితి మారలేదు.

కదలని పనులు..కలగానే ఆహ్లాదం
author img

By

Published : Jul 4, 2019, 9:54 AM IST

శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందు గద్వాలలో మినీ ట్యాంకుబండ్‌, పార్కు నిర్మాణం కోసం రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐజ పురపాలికలో పనుల విషయంలోనూ ఉత్తర్వులు వచ్చినా సాంకేతిక కారణాలతో కాస్త ఆలస్యమైంది. గద్వాల పురపాలిక సమీపంలోని సంగాల జలాశయాన్ని మినీ ట్యాంకుబండ్‌గా మార్చాల్సి ఉంది. ఇందులో భాగంగా జలాశయం ఆనకట్టపై మట్టిపోసి చదును చేశారు. ట్రెంచ్‌ కటింగ్‌ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనుల్లో 8 నెలలుగా అడుగు ముందుకు పడటం లేదు. చెరువుకు ఆనుకుని ఉన్న ప్రదేశంలో పార్కు నిర్మాణానికి ఇప్పటికే పునాది రాయి వేశారు. అక్కడ తమ భూములు ఉన్నాయని కొందరు అభ్యంతరం చెప్పగా పనులు ఆగిపోయాయి.

పార్కు నిర్మాణం కోసం ఎంపిక చేసిన ప్రదేశం సమీపంలో తమ భూమి ఉందటూ కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలిపారు. ఈ కారణంగా పనులు ఆగిపోయాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సర్వేచేసి నివేదిక ఇస్తాం. సర్వే పూర్తయితే పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
- ఇంతియాజ్‌ అహ్మద్‌, పురపాలిక డీఈ

ఐజ పురపాలికలో మరీ అధ్వాన పరిస్థితి నెలకొంది. పట్టణానికి పెద్దఎత్తున నిధులు మంజూరుకాగా పనుల్లో అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మినీ ట్యాంకుబండ్‌ నిర్మాణం కోసం ఎంపిక చేసిన బింగిదొడ్డి చెరువు విషయంలో అధికార పార్టీలోనే ఇరువర్గాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వారు సాంకేతిక కారణాలు ఎత్తిచూపుతూ కోర్టులను ఆశ్రయించటం వల్ల పనులు ప్రారంభం కాలేదు. ఎప్పుడు మొదలవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని ఐజ ప్రజలు పేర్కొంటున్నారు.

ఇవీ చూడండి: రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన

సికింద్రాబాద్  యాంకర్.. వైద్యులపై జరుగుతున్న దాడలు సమాజానికి మంచిది కాదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు ..జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ సన్షైన్ హాస్పిటల్ లో ఎల్డర్ క్లబ్ సంయుక్తంగా సెమినార్ నిర్వహించారు..కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలకు గాను  పలు ఆస్పత్రులకు  చెందిన డాక్టర్లను మంత్రి  ఈటల రాజేందర్ సన్మానించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మారుతున్న నేటి సమాజంలో పెద్దలకు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వట్లేదని వారిని వృద్ధాశ్రమాలకు  తరలిస్తున్నారని తన బాధను వ్యక్తం చేశారు.. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతిని దశకు చేరుకున్నాయని అన్నారు.సమాజంలో చనిపోతున్న మానవ సంబంధాలను పరిపుష్టి చేయాలంటే అది పెద్దల వల్లనే సాధ్యమవుతుందని అన్నారు ..జీవితంలో ఎంత సంపాదనే ద్యేయం కాకుండా  సమాజంలో ఎంతో ప్రశాంతత బతుకుతున్నమనేది ముఖ్యమన్నారు..బిల్డర్స్ క్లబ్ వారు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని తమ ప్రభుత్వ సహకారం వారికి ఉంటుందని తెలియజేశారు ..దేశవ్యాప్తంగా డాక్టర్ల పై జరుగుతున్న దాడులను ఖండించారు ..డాక్టర్ల పై దాడి చేయడం సరైన చర్య కాదని వీటికి చట్టాలు పోలీసులే కాకుండా మనుషుల్లో మార్పు రావాలని అన్నారు..వైద్య వృత్తి పట్ల వారికి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించటానికి రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వైద్యవృత్తి గొప్పతనాన్ని పెంపొందెలా కృషి చేస్తామన్నారు వైద్యులకు గౌరవాన్ని గుర్తింపుతో పాటు తమ ఆత్మగౌరవాన్ని నిలిపేలా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు  

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.