జోగులాంబ గద్వాల జిల్లా 30 రోజుల ప్రణాళికలో ముందంజలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి, కలెక్టర్ శశాంక, గద్వాల, అలంపూర్ శాసనసభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రతి రెండు మాసాలకు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి అన్నారు. జిల్లాలో అభివృద్ధి, ప్రభుత్వపరంగా నిధుల జాప్యం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో ముందడుగులో ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సరితతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్