పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్… రాష్ట్రవ్యాప్తంగా 19 డయాగ్నొస్టిక్ కేంద్రాల (diagnosis center)ను ఇవాళ ప్రారంభించుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డయాగ్నొస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ వాణీదేవి, స్థానిక జడ్పీ ఛైర్ పర్సన్ సరితతో కలిసి మంత్రి ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతోనే ప్రతి పేదవాడికి ప్రభుత్వ వైద్యం ఉందాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా డయాగ్నొస్టిక్ సెంటర్స్ ప్రారంభించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళితే ఖర్చు తడిసి మోపెడవుతుందని ముఖ్యమంత్రి గ్రహించి డయాగ్నొస్టిక్ సెంటర్లు (diagnosis center) ఏర్పాటు చేసినట్లు మంత్రి అన్నారు. గద్వాలకు నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించినట్లు ఆయన తెలిపారు.