నడిగడ్డ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూ. 743 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టి.. రెండు సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మల గ్రామం దగ్గర తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఏర్పాటు చేసిన పంపు వద్ద పూజాలు నిర్వహించి.. అనంతరం ఆర్డీఎస్ కాల్వకు నీటిని విడుదల చేశారు. దేశంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే సీఎం కేసీఆరేనని మంత్రి కొనియాడారు.
అంతకముందు మంత్రి నిరంజన్ రెడ్డికి నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం స్వాగతం పలికారు. కాల్వ దగ్గర పంపు ద్వారా వచ్చే నీటికి ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్పర్సన్ సరితతో కలిసి పూజలు నిర్వహించి వాయనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: పులిచింతల వద్ద పర్యటక సందడి