దిశ నిందితుల ఎన్కౌంటర్ ఒక బూటకమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో అన్నారు. ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై నిందితులను చంపించారని.. రాష్ట్ర ప్రభుత్వం ఒక సామాజిక వర్గానికి లొంగి నిందితులను ఎన్కౌంటర్ చేయించిందన్నారు. అదే నిందితులలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక్కరు ఉన్న కూడా ఎన్కౌంటర్ జరిగి ఉండేది కాదన్నారు.
దిశ మరణానికి ముందు, ఆ తర్వాత ఎన్నో హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఎంత క్రూరమైన హత్యలు చేసిన నిందితులకైనా చట్ట ప్రకారమే న్యాయస్థానంలో శిక్ష విధించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను చట్టసభలలో మెచ్చుకున్నారు. కానీ హాజీపూర్‌లో బీసీ వర్గానికి చెందిన ముగ్గురు బాలికలను చంపిన శ్రీనివాస్ రెడ్డిని ఎన్కౌంటర్ చేయమని చెప్పాలేదని వ్యాఖ్యానించారు. మహిళల రక్షణ కోసం ఈ నెల 23న నిర్వహించబోయే బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు.