ETV Bharat / state

జరాల, నెట్టెంపాడు పూర్తికాక నీరుగారుతున్న ఆశయం - management issues in jurala and nettempadu projects

కర్ణాటక ప్రాజెక్టులకు వరద రాక మొదలైంది. కొంచెం ఆలస్యమైనా జూరాలకూ రానుంది. వచ్చిన నీటిని నిల్వ చేసుకుని జాగ్రత్తగా వాడుకునేందుకు క్షేత్రస్థాయి సమస్యలు ఆటంకంగా మారుతున్నాయి. ఇప్పటికే జూరాల, నెట్టెంపాడు పథకాల పరిధిలో అసంపూర్తి పనులన్నీ పూర్తిచేసి సాగునీటి విడుదలకు అన్ని సిద్ధం చేయాల్సి ఉండగా అది జరగ లేదు. ముఖ్యంగా ప్రధాన కాల్వల తూముల వద్ద చాలా నిర్వహణ లోపాలున్నాయి.

management issues in jurala and nettempadu projects
author img

By

Published : Jul 12, 2019, 11:57 AM IST

జూరాల కుడి కాల్వ, ఎడమ కాల్వ పరిధిలో వారం కిందట పనులు మొదలయ్యాయి. ప్రధాన, ఉప కాల్వల్లో జమ్ము తొలగింపు, దెబ్బతిన్న చోట మరమ్మతులు, ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లకు గ్రీసింగ్‌, తాళ్ల మార్పులు వంటి పనులు చేస్తున్నారు. ఈ పనులన్నీ ఏప్రిల్‌లో మొదలై జూన్‌ నెలాఖరులోపే ముగించాలి. కానీ జులైలోనూ పనులు సాగుతున్నాయి. మరో 10 రోజుల్లో జూరాలకు వరద వస్తే పనులన్నీ మధ్యలోనే నిలిపివేయాల్సి ఉంటుంది. దాదాపు రూ. 1.50 కోట్లతో కాల్వల పరిధిలో చేస్తున్న మరమ్మతు పనులు పూర్తికాకుంటే ప్రధాన కాల్వలు, ఉపకాల్వల ద్వారా ఆయకట్టుకు విడుదల చేసే నీరు భారీగా వృథా కానుంది.

తోడిపోత ఒక్కటే కాదు :

నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా ఏటా నీటిని తోడిపోసి దాని పరిధిలోని జలాశయాలు నింపుతున్నారు. జలాశయాల తూముల వద్ద గేట్ల నియంత్రణ వ్యవస్థ సక్రమంగా లేదు. ఫలితంగా పంటకాలం పూర్తికాక ముందే జలాశయాల్లో నీరంతా ఖాళీ అవుతోంది. గతేడాది చాలామంది రైతులు నష్టపోయారు. గేట్ల నియంత్రణకు ప్రత్యేక సిబ్బంది లేరు. ఆయకట్టు రైతులు ఇష్టారాజ్యంగా గేట్లను ఎత్తి నీటిని వృథా చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు ర్యాలంపాడు జలాశయం రెండు తూముల వద్ద మోటార్లతో గేట్ల ఆపరేటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. గుడ్డెందొడ్డి జలాశయం వద్ద రెండు కాల్వల తూములకు గేట్లు అమర్చినా ప్రాథమికంగా అవసరమైన హైమాస్ట్‌ వ్యవస్థనే ఏర్పాటు చేయలేదు.

టీఎంసీ నీటి విలువ రూ. 6 కోట్లు :

ఏటా నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 10 టీఎంసీల నీటిని తోడిపోసేందుకు రూ.60 కోట్లు ఖర్చు అవుతోంది. ప్రాజెక్టు, కాల్వలు, ఇతర నిర్వహణ ఖర్చులు దీనికి అదనం. అన్నీ కలుపుకొంటే ఒక టీఎంసీ నీటికి రూ. 10 నుంచి రూ. 12 కోట్ల వరకు ఖర్చవుతుంది. భారీ మొత్తంలో వెచ్చించి నిల్వ చేసుకుంటున్న నీటిని సమర్థంగా వినియోగించుకోకపోవటం విచారకరమే. అధికార యంత్రాంగం నీటి తోడిపోతే కాకుండా నిర్వహణ లోపాలు లేకుండా చూసి వృథాను నివారించాలని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి : అసోంలో భారీ వరదలు..లక్షలాది మందికి ఇక్కట్లు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.