జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన మధు (21) అనే యువకుడు గ్రామ శివారులో ఉన్న చెరువుకు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈత రాకపోవడం వల్ల మృతి చెందాడు. తండ్రి నరసింహులు ఫిర్యాదు మేరకు ఐజ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. మధు గత నాలుగు సంవత్సరాలుగా కర్నూల్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు.
ఇవీ చూడండి: మనస్తాపంతో యువకుని ఆత్మహత్య