జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలో నిర్మితమవుతున్న రైతువేదిక భవన నిర్మాణ పనులను, పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ శ్రుతి ఓఝా ఆకస్మికంగా పరిశీలించారు. దసరా పండుగ నాటికి పూర్తి కావలసిన రైతువేదిక నిర్మాణం ఇప్పటి వరకు పూర్తికాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రంలోగా మిగిలి ఉన్న పనులను పూర్తి చెయ్యాలని ఆదేశించారు.
అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. వనంలో నాటిన ప్రతి మొక్కను బతికించుకుని 6 నెలల్లో మంచి ఎదుగుదల కనిపించేలా చూడాలని లేని పక్షంలో పంచాయతీ సెక్రటరీ, సర్పంచుపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్కడే కొన్ని మొక్కలను నాటకుండా పడి ఉండటాన్ని గమనించిన కలెక్టర్ పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో రైతువేదిక నిర్మాణం పూర్తి చేయించక, పల్లె ప్రకృతి వనం ఏర్పాటులో సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున పంచాయతీ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చెయ్యాలని ఎంపీడీవో రాజారమేశ్ను ఆదేశించారు.
ఇదీ చూడండి: జోగులాంబ జిల్లాలో రిజిస్ట్రేషన్ల విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ శృతి ఓఝా