జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పురపాలక పరిధిలోని లార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు అవగాహన కల్పించారు. లార్డ్ స్వచ్ఛంద సంస్థ, ఆశావర్కర్లు, కౌన్సిలర్లు వార్డుల్లో తిరుగుతూ వైరస్‌పై ప్రజలందరికీ అర్ధమయ్యేలా నివారణ చర్యలు వివరించారు.
ఎవరైనా దగ్గు, తుమ్ములు, శ్వాసకోశ ఇబ్బందులు పడుతూ ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఈ ప్రమాదకర వ్యాధిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని కోరారు.
ఇవీ చూడండి: కరోనా @110: భారత్‌ను కలవరపెడుతోన్న కొవిడ్-19 కేసులు