ETV Bharat / state

Konda Laxman Bapuji Award 2023 : కొత్తరకం డిజైన్లతో చీరలను నేశారు.. కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డును కొట్టేశారు

Konda Laxman Bapuji Award 2023 : ఒక్కో పోగు జత చేసి.. వస్త్రాన్ని కళాత్మకంగా మార్చే నేతన్న కష్టం వెలకట్టలేనిది. ఆ శ్రమ వెనక ఎన్నో ఒడిదొడుకులు దాగి ఉన్నాయి. దశాబ్దాలుగా వస్త్రాలపై కళాకృతులు తీర్చిదిద్దుతూ ఔరా అనిపిస్తున్న నేతన్నలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో అందించే కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికైన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Konda Laxman Bapuji Award
Handloom Worker
author img

By

Published : Aug 7, 2023, 9:27 AM IST

Konda Laxman Bapuji Award 2023 : కొత్తరకం డిజైన్లతో చీరలను నేశారు.. కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డును కొట్టేశారు

National Handloom Day 2023 in Telangana : గద్వాల పట్టు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. పట్టు వస్త్రంపై నూలు, సిల్కు ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ... ఇక్కడి చేనేతకారుల ప్రత్యేకతగా వివరిస్తున్నారు. ఇతరులకు భిన్నంగా నూతన ఒరవడితో మగ్గం నేస్తూ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో కొత్తరకం డిజైన్లతో చీరలను తయారు చేసి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పురస్కారాలకు ఉమ్మడి జిల్లా నుంచి 9 మంది ఎంపికయ్యారు.

Konda Laxman Bapuji Award 2023 : ఇందులో జోగులాంబ గద్వాల జిల్లా నుంచి డిజైనింగ్‌ విభాగంలో గోపాలకృష్ణ, పనిలో నైపుణ్యానికి వనపర్తి జిల్లా నుంచి సుశీల శాంతారామ్‌ ఎంపికయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 2వేల 140 జియోట్యాగ్‌ మగ్గాలు, నారాయణపేటలో 662, వనపర్తిలో 340, మహబూబ్‌నగర్‌లో 371, నాగర్​కర్నూల్​లో 15 జియోట్యాగ్ మగ్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3వేల 458 జియోట్యాగ్‌ మగ్గాలున్నాయి. వీటిపై ఆధారపడి దాదాపు 8వేలకు పైగా చేనేత కుటుంబాలు జీవిస్తున్నాయి. వివిధ రకాల డిజైనర్లతో పట్టు, సీకో కాటన్ చీరలు తయారీ చేస్తుంటారు.

Pochampally silk sarees : ఉద్యోగం వదలి.. చేనేత వైపు కదిలాడు.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు

'తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటిగా ఉపయోగించే శ్రీవారి జోడు పంచెల తయారీ చేసేటువంటి ఘనత ఈ గద్వాలకి ఉంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ గద్వాల నేతన్నకు, వారు నేసే చీరలకు దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఇంటర్ లాకింగ్​ సిస్టమ్​తో చీరలు నేస్తాం. ఇంటర్ లాకింగ్ అంటే పట్టుపైన నూలు, సిల్క్ రెండు కలిపి నేయడం. అంతటి చక్కని నైపుణ్యం కలిగిన నేత కార్మికులు ఇక్కడ ఉన్నారు.' - భీమేష్, చేనేత కార్మికుడు

National Handloom Day 2023 : నేతన్నలపై వరాల జల్లు.. ఆరోగ్యకార్డుతో పాటు ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేలు

Konda Laxman Bapuji Award for Weavers : ఇందులో భాగంగా అవార్డుకు ఎంపికైన వారికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో షీల్డు, శాలువ, 25వేల నగదు బహుమతి, సర్టిఫికెట్‌ అందించనున్నారు. చేనేత కార్మికుల నైపుణ్యాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతులు ఇవ్వటంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విధంగా ప్రోత్సహిస్తే ఇంకా అనేక డిజైన్లతో ప్రజలను ఆకట్టుకునే విధంగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటూ కొత్త ఉత్పత్తులు తీసుకొస్తామని చేనేత కార్మికులు చెబుతున్నారు.

'20 సంవత్సరాల నుంచి మగ్గం నేస్తున్నాం. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డ్స్ రావడం ఆనందంగా ఉంది. మాకే కాదు ఎవరికి వచ్చినా సంతోషమే. ఇలా అవార్డ్స్ రావడంతో పోటీ ఏర్పడి కొత్త కొత్త డిజైన్లతో చీరలు నేయగల్గుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తే ఇంకా రాణిస్తాం. మేమేందరం చేనేత కార్మికులమే.. ఎవరికి వచ్చినా మాకు సంతోషమే. ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇంకా కొత్త ఉత్పత్తులు తెస్తాం' - పులిపాటి సుధాకర్, చేనేత కార్మికుడు

ఔరా! అనిపిస్తున్న చేనేత వెండి చీర.. ధర ఎంతో తెలుసా?

Handloom Entrepreneur : కష్టపడితే కానిదేముందని నిరూపిస్తున్న మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.