ETV Bharat / state

KCR Jogulamba Gadwal Tour : 'ప్రజలు ధరణి కావాలంటున్నారు.. కానీ కొన్ని పార్టీలు వద్దంటున్నాయి' - CM inaugurated BRS office in Jogulamba Gadwal

CM KCR Inaugurate New Collectorate in Jogulamba Gadwal district : జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ది కోసం ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు, ప్రతి మండల కేంద్రానికి రూ.15 లక్షలు, గద్వాల పురపాలికకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద మల్లమ్మకుంట జలాశయం పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. జిల్లా పరిపాలన భవనాలను ప్రారంభించి.. అక్కడ నిర్వహించిన ప్రగతి నివేదన సభలో పాల్గొని ప్రసంగించారు. పాలమూరు జిల్లాలో ఇప్పటికే నెట్టెంపాడు, భీమా, తుమ్మిళ్ల ఇతర ఎత్తిపోతల పథకాల ద్వారా 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని.. మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

KCR
KCR
author img

By

Published : Jun 12, 2023, 5:31 PM IST

Updated : Jun 12, 2023, 8:44 PM IST

CM KCR Jogulamba Gadwal Tour : జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ది కోసం ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు.. ప్రతి మండల కేంద్రానికి రూ.15 లక్షలు.. గద్వాల పురపాలికకు రూ.50 కోట్లు.. మిగిలిన మూడు పురపాలికలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్​ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన జోగులాంబ గద్వాల జిల్లా ప్రగతి నివేదన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

శంకుస్థాపనలకే పరిమితం : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో క‌ల్వకుర్తి, నెట్టెంపాడు.. కోయిల్‌సాగ‌ర్, బీమా ఎత్తిపోత‌ల‌ పథకాలన్నింటిని పూర్తి చేసుకున్నామని కేసీఆరే పేర్కొన్నారు. తద్వారా 15లక్షల నుంచి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. గతంలో మంత్రులుగా ఉన్నవారు.. ఏ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయలేదని విమర్శించారు. వారు కేవలం శంకుస్థాపనలకు పరిమితం అయ్యారని కేసీఆర్ దుయ్యబట్టారు.

ధరణిని బంగాళాఖాతంలో వేస్తారని అంటున్నారు : తెలంగాణ వచ్చిన తర్వాతే నెట్టెంపాడు, బీమా ద్వారా సాగునీరు అందుతుంద‌ని.. గ‌ట్టు ఎత్తిపోతలకు పునాదిరాయి వేసుకున్నామని.. ఆ ప‌నులు కూడా త్వర‌లోనే పూర్తవుతాయ‌ని కేసీఆర్ వివరించారు. ఆర్డీఎస్‌ కొనసాగింపుగా ఉన్న మల్లమ్మకుంట జలాశయం పనులను సైతం త్వరలోనే పూర్తి చేస్తామని హమీ ఇచ్చారు. మూడు సంవత్సరాలు కష్టపడి ధరణిని తీసుకువస్తే.. కాంగ్రెస్‌ వాళ్లు బంగాళాఖాతంలో వేస్తారని అంటున్నారని కేసీఆర్‌ విమర్శించారు.

KCR on Dharani Portal : ధరణిని బంగాళాఖాతంలో కలపితే.. రైతులను బంగాళాఖాతంలో కలిపినట్లేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీని వల్లె రైతుబంధు, ధాన్యానికి డబ్బులు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. ధరణి ఉండాలా వద్దా.. మీరే చెప్పాలని ప్రశ్నించారు. కానీఎక్కడికి వెళ్లిన ధరణి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని.. ప్రతిపక్షాలు మాత్రం ఎత్తేస్తామంటున్నారని విమర్శించారు.ధరణి వద్దనే వాళ్లకు ప్రజలే జవాబు చెప్పాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అంతకుముందు గద్వాల కలెక్టరేట్‌లోని సమీకృత అధికారుల కార్యాలయ భవనంలో ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉందని వివరించారు. తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగం.. ఓడీఎఫ్​ ప్లస్‌, త్రాగునీరు అందించడంలో రాష్ట్రం ముందుందన్నారు. ఈ క్రమంలోనే బాగుప‌డ్డామ‌ని చెప్పి విశ్రాంతి తీసుకుంటే.. దెబ్బతినే ప్రమాదం ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రగతిని ఎవ్వరూ అందుకోలేరు : వ‌రి ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగ‌మించి.. రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో వరి 94 లక్షల ఎకరాలు సాగు అయితే.. 50 శాతం కంటే ఎక్కువగా 56లక్షల 40వేల ఎకరాలు తెలంగాణలోనే సాగైందని వివరించారు. మరో 5 సంవత్సరాలు కష్టపడితే దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉండటంతో పాటు.. రాష్ట్ర ప్రగతిని ఎవ్వరూ అందుకోలేరన్నారు. ఇదే పట్టుదలతో ముందుకు పోతే ఇంకా బాగా అద్భుతాలు సృష్టిస్తామని ఉద్యోగులకు కేసీఆర్ సూచించారు.

CM KCR Jogulamba Gadwal Tour : దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలు, వృద్ధులు బాధపడకుండా.. కంటి వెలుగు కార్యక్రమం చేపట్టామని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రాయితీ పథకాలు ఓట్ల కోసమో.. చిల్లర రాజకీయల కోసమో కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్​లోనే గద్వాల జిల్లాకు చేరుకున్న కేసీఆర్‌.. సాయంత్రం హెలికాప్టర్‌లోనే తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ప్రగతి నివేదన సభలో కేవలం 12 నిమిషాలు మాత్రమే ఆయన ప్రసంగించారు. సభలో మిగిలిన వారు ఎవ్వరు మాట్లాడలేదు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మంత్రులు మహమూద్‌ అలీ, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం పాల్గొన్నారు.

"గద్వాల జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. పిల్లలకు గురుకుల పాఠశాలల్లో చదువులు చెప్పిస్తున్నాం. జిల్లాలోని ఇద్దరు మంత్రులు తెలంగాణ ఉద్యమకారులే. దేశంలో ఎక్కడాలేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. పాలమూరులో గతంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు దొరికేది. ఇప్పుడు మిషన్‌ భగీరథతో మన ఆడపడుచులకు ఇంటి వద్దకే తాగునీరు వస్తోంది. గతంలో పాలమూరు నుంచి వలస వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు వలస వస్తున్నారు. పక్కనున్న ఏపీలో, మనవద్దా ఉన్న తేడాను మీరే చూడండి. ధరణి ఉండాలా వద్దా.. మీరే చెప్పండి." - కేసీఆర్, ముఖ్యమంత్రి

ప్రజలు ధరణి కావాలంటున్నారు కానీ కొన్ని పార్టీలు వద్దంటున్నాయి

ఇవీ చదవండి : KCR Nirmal Tour ఎన్నికలు వస్తున్నందున ఇష్టారీతిన మాట్లాడుతున్నారు

CM KCR Nagar Kurnool Tour : 'ధరణిని బంగాళాఖాతంలో వేస్తే మళ్లీ లంచాల రాజ్యం వస్తుంది'

Revanth Reddy criticizes Dharani portal : 'ధరణి విషయంలో కేసీఆర్ పెద్ద దళారీ'

Last Updated : Jun 12, 2023, 8:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.