ETV Bharat / state

కర్ణాటక నుంచి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ - కృష్ణా నది వార్తలు

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టికి వరద ప్రవాహం పెరిగింది. 36 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరో నాలుగు టీఎంసీలు నిండితే నారాయణపూర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండుతుంది. ఈ ప్రాజెక్టు నాలుగు గేట్లను ఆదివారం ఎత్తారు. 28వేల క్యూసెక్కుల నీటిని జూరాలకు వదిలారు. ఇవాళ సాయంత్రానికి జూరాలకు నీటి ప్రవాహం చేరుకోనుంది.

krishna-water
krishna-water
author img

By

Published : Jul 13, 2020, 12:10 PM IST

కర్ణాటక నుంచి పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ బిరబిరా వస్తోంది. ఆ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ఆలమట్టికి 70 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 36 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీంతో మరో నాలుగు టీఎంసీలు నిండితే నారాయణపూర్‌ జలాశయం కూడా పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరుకోనుంది. ఈ జలాశయానికి ఎగువ నుంచి 40 వేల క్యూసెక్కులు వస్తుండటంతో ప్రాజెక్టు నాలుగు గేట్లు ఆదివారం ఎత్తారు. సుమారు 28,480 క్యూసెక్కుల ప్రవాహాన్ని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి జోగులాంబ గద్వాల జిల్లా పారేవుల సమీపంలో.. ఎగువ నుంచి వస్తున్న వరద జూరాల వెనుక జలాలను తాకే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

వరద పెరిగితే వారం రోజుల్లో శ్రీశైలానికి..

జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 1,045 అడుగులకు గాను ఆదివారం నాటికి 1,042.29 అడుగుల వద్ద నీళ్లు ఉన్నాయి. మరో మూడు అడుగులు చేరితే తొలుత విద్యుదుత్పత్తి ప్రారంభించి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఇప్పటికే పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నదికి రోజుకు 4 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద కూడా తోడైతే జూరాలను దాటి వారం రోజుల్లో శ్రీశైలాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. తుంగభద్ర నదికి కూడా వరద క్రమంగా పెరుగుతుండటంతో ఈ ఏడాది శ్రీశైలానికి ముందుగానే వరద పోటెత్తుతుందని భావిస్తున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీని దాటి మూడు వేల క్యూసెక్కుల వరద సముద్రంలో కలుస్తోంది.

గోదావరి పరీవాహకంలో ప్రాణహిత నుంచి భారీ వరద వస్తోంది. కాళేశ్వరం వద్ద నదిలో 7.38 అడుగుల స్థాయిలో 90 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. లక్ష్మీ బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరామసాగర్‌ ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం స్వల్పంగా పెరిగి 11 వేల క్యూసెక్కుల వద్ద కొనసాగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీని దాటి 1.21 లక్షల క్యూసెక్కుల జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.

జూరాల కాల్వలకు నీటి విడుదల

ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో.. ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జూరాల ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం పాల్గొని కుడి కాల్వకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఎడమ కాల్వకు ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి మంత్రి విడుదల చేశారు. దీంతో కుడి, ఎడమ కాల్వల పరిధిలో 1.02 లక్షల ఎకరాలకు సాగు నీరందనుందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మరోవైపు నదిలో ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకటి రెండు రోజుల్లో నాలుగు ఎత్తిపోతల పథకాల్లో ఒక్కో పంపు చొప్పున ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.