ETV Bharat / state

జూరాలను దాటిన కృష్ణమ్మ.. ఎగువ నుంచి 50 వేల క్యూసెక్కుల రాక

వరుసగా గత కొన్నిరోజులుగా కురుస్తోన్న వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద నీరు జూరాల ప్రాజెక్టుకు చేరింది. ఉదయం వరకూ 14వేల క్యూసెక్కులు ఉన్న ప్రవాహం కాస్త రాత్రి సమయానికల్లా 50వేల క్యూసెక్కులకు చేరుకుంది. నీటి ఉద్ధృతి ఇలాగే కొనసాగితే కృష్ణమ్మ జూరాల నుంచి మరికొద్ది రోజుల్లో శ్రీశైలం జలాయశయాన్ని చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

jurala progect fill with upper rain water in jogulambha gadwala
జూరాలను దాటిన కృష్ణమ్మ.. ఎగువ నుంచి 50 వేల క్యూసెక్కుల రాక
author img

By

Published : Jul 15, 2020, 7:16 AM IST

Updated : Jul 15, 2020, 9:12 AM IST

ఎగువ ప్రాంతంలో ఆల్మట్టి ,నారాయణపూర్ ప్రాజెక్టు నుండి జూరాలకు భారీగా వరద వచ్చి చేరుతుంది, జూరాల ప్రాజెక్టు ఆరు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు.

జోగులాంబ గద్వాల జిల్లా లోని జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుండి జూరాలకు భారీగా వరద నీరు చేరుతుంది దీంతో జూరాల జలాశయానికి 40 వేల 076 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు లోకి వచ్చి చేరుతుంది. జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 318.440 మీటర్లు , జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు జూరాల జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 9.500 టీఎంసీలు జూరాల జలాశయం నుండి 6 గేట్లు తెరిచి 28,641 క్యూసెక్కులు దిగువకు విడుదల. జూరాల జల విద్యుత్ నుండి 3 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, నెట్టెంపాడుకు 750 క్యూసెక్కులు, బీమాకు 650 క్యూసెక్కులు విడుదల. కోయిల్ సాగర్ 630 క్యూసెక్కులు, కుడి కాలువ నుండి 252 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుండి700 క్యూసెక్కులు, పార్లల్ కెనాల్ ద్వారా 900 క్యూసెక్కులు నీరుని విడుదల చేస్తున్నారు.

జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ శ్రీశైలం వైపునకు వడివడిగా పరుగులెడుతోంది. ఎగువ నుంచి 50 వేల క్యూసెక్కుల వరకు వరద వస్తుండటంతో మంగళవారం రాత్రి జూరాల ఐదు గేట్లు తెరిచి స్పిల్‌వే ద్వారా దిగువకు 26,759 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రెండు గేట్లను రెండు మీటర్లు, మూడు గేట్లను ఒక్కో మీటరు చొప్పున ఎత్తారు. వరద నేపథ్యంలో ఎగువ, దిగువ జూరాల ప్రాజెక్టులోని మొత్తం ఆరు జలవిద్యుత్తు ఉత్పత్తి యూనిట్లలో 234 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి జరుగుతోంది. విద్యుత్తు ఉత్పత్తి అనంతరం 23,501 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. జూరాలకు ఎగువ నుంచి వరద పెరుగుతుండటం వల్ల దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

14 వేల నుంచి 50 వేలకు..

నారాయణపూర్‌ నుంచి జూరాలకు క్రమంగా ప్రవాహం పెరుగుతూ వస్తోంది. మంగళవారం ఉదయానికి 14 వేల క్యూసెక్కులున్న ప్రవాహం రాత్రి సమయానికి యాభై వేల క్యూసెక్కులకు చేరుకుంది. బుధవారానికి ఇది అరవై వేల వరకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల్లో కృష్ణమ్మ శ్రీశైలం జలాశయాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మరోవైపు ఆలమట్టి వద్ద ప్రవాహం 41 వేల క్యూసెక్కులకు తగ్గింది. నారాయణపుర్‌ వైపునకూ విడుదల తగ్గింది.

ఇదీ చూడండి: ఆలమట్టి నిండకముందే నీటిని విడుదల చేసిన కర్ణాటక

Last Updated : Jul 15, 2020, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.