జోగులంబ గద్వాలలోని జూరాల జల విద్యుత్ రేవులపల్లి ఉద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మృతి చెందిన విద్యుత్ ఉద్యోగులకు సంతాపం తెలిపారు. అమరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. వారికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ జయరామ్, డీఈలు, విద్యుత్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.