ETV Bharat / state

కంటైన్​మెంట్​ జోన్లలో నిఘా పటిష్ఠం చేయాలి : రొనాల్డ్​ రాస్​

జోగులాంబ గద్వాల జిల్లాలోని కంటైన్​మెంట్​ జోన్లలో నిఘా పటిష్ఠం చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి రొనాల్డ్​రాస్​ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణపై కలెక్టరేట్​ సమావేశ మందిరంలో కలెక్టర్​, ఎస్పీ, వైద్య, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

రొనాల్డ్​ రాస్​
రొనాల్డ్​ రాస్​
author img

By

Published : Apr 24, 2020, 5:08 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలు బయటికి రాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రత్యేకాధికారి రొనాల్డ్​రోస్​ సూచించారు. కరోనా నియంత్రణపై కలెక్టరేట్​ సమావేశ మందిరంలో కలెక్టర్​ శృతి ఓజా, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీహర్ష, వైద్య, ఇతర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.

ఇంటింటికి వెళ్లి ఆశా వర్కర్లు తెచ్చే ఆరోగ్య సమాచారాన్ని వైద్యులు పర్యవేక్షించాలని తెలిపారు. మెడికల్ షాపుల నుంచి ఎవరెవరు దగ్గు మందును తీసుకెళ్లారనేది డ్రగ్ ఇన్​స్పెక్టర్ ద్వారా నివేదిక తీసుకోవాలన్నారు. వారి అనారోగ్య వివరాలు ఆశావర్కర్లు సేకరించిన జాబితాలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలన్నారు. జాబితాలో లేకుంటే మెడికల్ ఆఫీసర్... వారి వద్దకు వెళ్లి పూర్తి ఆరోగ్య సమాచారం సేకరించాలని చెప్పారు. హోం క్వారంటైన్లలో ఉన్న వారు నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ క్వారంటైన్​కు పంపించాలని ఆదేశించారు.

కరోనా పాజిటివ్ కేసుల ట్రేస్​ అవుట్​ విధానం... వారిని క్వారంటైన్​కు తరలించే తీరును జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంబులెన్స్​లో ఎక్కువమందిని ఎక్కించరాదని సూచించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటిని, పరిసరాలను రసాయనాలతో పిచికారీ చేయాలన్నారు.

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.