ETV Bharat / state

ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి: ఎస్పీ రంజన్​ రతన్​ కుమార్ - జిల్లా ఎస్పీ రంజన్​ రతన్​ కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల అవగాహన

ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్​ రతన్​ కుమార్ సూచించారు. జిల్లాకేంద్రంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో 'మై ఆటో ఈజ్​ సేఫ్' అనే యాప్​పై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

Jogulamba gadwal district SP Ranjan ratan kumar training to auto drivers on My Auto is Safe Mobile App today
ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి: ఎస్పీ రంజన్​ రతన్​ కుమార్
author img

By

Published : Mar 20, 2021, 7:42 PM IST

ఆటో డ్రైవర్లు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్​ రతన్​ కుమార్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో 'మై ఆటో ఈజ్​ సేఫ్' అనే యాప్​పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్లు విధి నిర్వహణలో సెల్​ఫోన్​లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు. ప్యాసింజర్లతో మర్యాదగా వ్యవహరిస్తూ గమ్యానికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రయాణికులను ఆటో డ్రైవర్లు ఇబ్బందులకు గురి చేసిన ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. గద్వాలలో మొత్తం 400 అటోలు ఉన్నాయని.. అందులో 240 మంది ఆటో డైవర్లకు యాప్​ను వినియోగిస్తున్నారని అన్నారు. మిగిలిన వారంతా వారం రోజుల్లో ఈ యాప్​ ఉపయోగించపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ జక్కుల హనుమంతు, ఎస్సైలు హరి ప్రసాద్ రెడ్డి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్​ స్థానంలో వాణీదేవికి పట్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.