ETV Bharat / state

భయం గుప్పిట్లోనే జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల మినహా మిగతా పాలమూరు జిల్లాల ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు జిల్లాల్లో కొత్త పాజిటివ్‌ కేసులు నమోదై 18 రోజులు గడిచిపోయింది. ఈ రెండు జిల్లాలు సేఫ్‌ జోనులోకి వెళ్లాయని చెప్పవచ్ఛు ఈ జిల్లాల్లో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు కూడా చికిత్స అనంతరం స్వస్థత పొంది ఇళ్లకు చేరుతున్నారు. అయినా ముందు జాగ్రత్తగా హోం క్వారంటైనుకు పరిమితమవుతున్నారు.

jogulamba gadwal district is not free from corona
భయం గుప్పిట్లోనే జోగులాంబ గద్వాల
author img

By

Published : Apr 26, 2020, 1:38 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11 మందికి పాజిటివ్‌ రాగా.. ఏడుగురు ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. మరో ఇద్దరు రెండు రోజుల్లో కానున్నారు. గండీడ్‌ మండలానికి చెందిన డీసీఎం డ్రైవరుకు నెగటివ్‌ రావడంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

నారాయణపేట జిల్లా ఉట్కూరులో హోం క్వారంటైనులో ఉన్నవారికీ ఊపశమనం లభించింది. నవాబుపేట మండలంలోని గ్రామంలో రెండు రోజుల కిందట ఓ వ్యక్తి మృతిచెందారు. ఈ వ్యక్తికి సైతం నెగటివ్‌ రావడంతో ఆ గ్రామస్థులకు ఊరట కలిగింది.

మహబూబ్‌నగర్‌లో ప్రభుత్వ క్వారంటైనులో ఉన్న 8 మంది నమూనాలను శనివారం పరీక్షలకు పంపించారు. వీటి ఫలితాలు మాత్రం రావాల్సి ఉంది. నారాయణపేట, నాగర్‌కర్నూలు జిల్లాలు సేఫ్‌ జోనులోనే కొనసాగుతున్నాయి. వనపర్తి జిల్లా మొదటినుంచీ గ్రీన్‌ జోను పరిధిలో ఉంది.

ఆందోళనంతా గద్వాలపైనే.. :

జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా భయం వీడటం లేదు. ఇంకెన్ని కొత్త కేసులు నమోదవుతాయోనని స్థానికులు ఆందోళనతో ఉన్నారు. పట్టణంలోని ఓ ప్రాంతంలో శనివారం ఓ యువతి అనారోగ్యంతో మృతిచెందగా స్థానికంగా కలకలం రేగింది. ఆమె ఇంటి సమీపంలోనే గతంలో కరోనా పాజిటివ్‌ వ్యక్తి మృతిచెందారు. యువతి అంత్యక్రియలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించారు.

ప్రధానంగా పని మనుషులు, క్షురకుల విషయంలో స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీరు ఇంటింటికి తిరుగుతుండటంతో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. శనివారం ప్రభుత్వ క్వారంటైనులో ఉన్న 76 మందిని హోం క్వారంటైనుకు తరలించారు.

జిల్లాలో కొత్తగా నల్లకుంట, వేదనగర్‌, లింగన్‌వాయి, మూగోనిపల్లి ప్రాంతాలను కంటైనుమెంటు జోన్లుగా గుర్తించారు. ఉన్నతాధికారులు ఆ ప్రాంతాల్లో పర్యటించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లాలో కొత్తగా ఎలాంటి నమూనాలు సేకరించడం లేదు. అనుమానితులను హోం క్వారంటైనుకే పరిమితం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.