జోగులాంబ గద్వాల జిల్లాలో అకారణంగా రోడ్లపైకి వస్తున్న వారిని స్థానిక సీఐ వినూత్న రీతిలో బయటకు రావద్దని చెప్తున్నారు. ఒక ప్రాంతంలో ఉండేవారు.. ఇంకో ప్రాంతంలోకి ప్రవేశిస్తూ.. అడ్డుకున్న పోలీసులకు చిన్న చిన్న కారణాలు చెప్తున్నారు. ఒక్కో ద్విచక్ర వాహనం మీద ఒకరి కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయట తిరుగుతున్న వారందరినీ సీఐ జక్కుల హనుమంతు బతిమిలాడి చెప్తూ విజ్ఞప్తి చేస్తున్నారు. అనవసరంగా రోడ్ల పైకి వచ్చి ప్రాణాలుకు ఎందుకు ముప్పు తెచ్చుకుంటారని ప్రజలకు అర్థమయ్యేలా చెప్తూ వేడుకుంటున్నారు. వాహనదారులు, ప్రజలను బయటకు రావద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్