జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ శ్రుతి ఓఝా ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు క్రాప్ లోన్ ఉన్నవారికి కొవిడ్ వేళ పది శాతం అదనంగా రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశం జారీ చేసిందని.. జిల్లాలో చాలా బ్యాంకుల లక్ష్యం మేరకు రుణాలు అందించలేకపోతున్నాయని వాటికి గల కారణాలు ఏంటని జిల్లా కలెక్టర్ శ్రుతి ఓఝా బ్యాంకర్లను ప్రశ్నించారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించకుండా.. నిర్లక్ష్యం చేయడంపై సమాధానం చెప్పాలని బ్యాంకర్లను నిలదీశారు.
ప్రధానమంత్రి స్వనిధి ద్వారా వీధి వ్యాపారస్థులకు ఇచ్చే రూ. పది వేల రుణాలను వెంటనే అర్హులకు మంజూరు చేయాలని వారిని బ్యాంకర్లను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టయిన డెయిరీ యూనిట్లు 587 ప్రతిపాదనలు పంపించగా 337 బ్యాంక్ కన్సెంట్ ఇవ్వటం జరిగిందని.. మిగిలిన వాటినీ త్వరలో మంజూరు చేసే విధంగా చూడాలన్నారు. అనంతరం గతేడాది వివిధ పథకాలను లబ్ధిదారులకు అందించటంలో కృషి చేస్తున్న బ్యాంక్ మేనేజర్లను అభినందించారు.
ఇవీ చూడండి: 'విశ్వవిద్యాలయాలు పూర్వ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలి'