జోగులాంబ గద్వాల జిల్లాలోని కంటైన్మెంట్ జోన్లో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ శృతి ఓఝా భరోసా కల్పించారు. మంగళవారం ఇదయం జిల్లా ఎస్పీ అపూర్వరావు, అధికారులతో కలిసి కంటైన్మెంట్ జోన్లలో పర్యటించారు. అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితులు, వారికి అందుతున్న నిత్యావసర సరుకుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఒకవేళ ఎమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే 104, 100, 08456-274007కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. ప్రతిరోజూ ఉదయాన్నే గృహ నియంత్రణలో ఉన్న ప్రతి ఇంటిని సందర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించాలని మెడికల్ ఆఫీసర్ స్రవంతిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ క్రిష్ణ, ఆర్డీఓ రాములు, డీఎస్పీ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ నర్సింహా, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. శశికళ, మెడికల్ ఆఫిసర్ స్రవంతి ఉన్నారు.
ఇదీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు