ETV Bharat / state

మన దేశం.. మన బీటీ పత్తి - The latest news from the National Cotton Research Institute

పత్తి పంటలో కొత్త పరిశోధన ఆశలు రేకెత్తిస్తోంది. మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి విడుదల చేసిన దేశీయ బీటీ పత్తి విత్తన పంటలు మంచి దిగుబడినిచ్చాయి. 'జాతీయ పత్తి పరిశోధనా సంస్థ' (సీఆర్‌ఐ) ఈ సీజన్‌లో పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా వీటి సాగుకు అనుమతి ఇచ్చింది.

Cotton crop
మన దేశం.. మన బీటీ పత్తి
author img

By

Published : Feb 8, 2021, 6:45 AM IST

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో 'రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ' (టీఎస్‌ సీడ్స్‌) కోసం సాగుచేసిన పంట మంచి దిగుబడినిచ్చింది. దేశవ్యాప్తంగా సాగునీరు ఉన్న, లేని భూముల్లో సాగుకు 9 రకాల బీటీ పత్తి విత్తనాలను సీఆర్‌ఐ విడుదల చేసింది. వీటిలో కేంద్ర వ్యవసాయశాఖ నోటిఫై చేసిన 7 రకాల్లో టీఎస్‌ సీడ్స్‌కు 4 రకాలు ప్రయోగాత్మకంగా ఇవ్వగా 56 క్వింటాళ్ల విత్తనాలను పండించినట్లు తెలిపింది. మొత్తం 7 రకాల్లో 6 మధ్య, ఉత్తర భారత రాష్ట్రాల భూములకు, మిగిలిన ఒకటి దక్షిణాది రాష్ట్రాలకు అనువైంది. దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే వానాకాలంలో సాగుకు ఇవ్వాలని జాతీయ పత్తి పరిశోధనా సంస్థ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు విత్తన కంపెనీలు లేదా సంస్థలు వీటిని అడిగితే విత్తన పంటల సాగుకు ఇస్తున్నారు.

Cotton crop
మన దేశం.. మన బీటీ పత్తి

మోన్‌శాంటోకు చెక్‌..

రెండు దశాబ్దాలుగా అమెరికాకు చెందిన మోన్‌శాంటో కంపెనీకి చెందిన రెండు బీటీ పత్తి విత్తన రకాలను మనదేశంలో రైతులు విస్తృతంగా పండిస్తున్నారు. వాటిపై మోన్‌శాంటో కంపెనీకి ఇప్పటికే రూ. 500 కోట్లను సుంకంగా మనదేశం చెల్లించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలో బీటీ పత్తి విత్తనాలను అభివృద్ధి చేసేందుకు సీఆర్‌ఐతో పాటు, పలు వ్యవసాయ వర్సిటీలు ప్రయోగాలు చేస్తున్నాయి. వీటిలో సీఆర్‌ఐ విడుదల చేసిన 7 రకాలను కేంద్రం గత అక్టోబరులో నోటిఫై చేసింది. తెలంగాణకు చెందిన ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా వరంగల్‌ కేంద్రంగా బీటీ పత్తి విత్తనాలపై విడిగా పరిశోధనలు చేస్తోంది.

సంకరజాతికి ధీటుగా

మోన్‌శాంటో కంపెనీకి చెందిన బీటీ-1 రకం విత్తనం మాదిరిగానే ఇవి పండుతున్నాయని సీఆర్‌ఐ సంచాలకుడు వైజీ ప్రసాద్‌ ‘ఈనాడు’కు చెప్పారు. సంకరజాతి విత్తనాలకు ధీటుగా దేశీ బీటీ విత్తన రకాలు పండుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సాధారణ మోన్‌శాంటో బీటీ పత్తి విత్తనాల పంట 180 రోజుల పాటు సాగులో ఉంటుంది. దీనివల్ల వర్షాకాలంలో విత్తనాలు నాటితే మళ్లీ ఆ భూముల్లో రబీ సీజన్‌ (అక్టోబరు)లో రెండో పంట వేయడానికి అవకాశం ఉండదు. కానీ సీఆర్‌ఐ విడుదల చేసిన 7 బీటీ విత్తనాల సాగుకాలం 150 రోజులే. దీనివల్ల జూన్‌ లేదా జులైలో విత్తనాలు వేస్తే డిసెంబరుకల్లా పంట సాగు పూర్తవుతుంది. తిరిగి జనవరి నుంచి అదే భూమిలో రెండో పంట వేసుకోవడానికి రైతులకు అవకాశం దక్కుతుంది. దీనివల్ల రబీలో రెండో పంట వేస్తే మరిన్ని పంటల సాగు, అధిక దిగుబడులకు అవకాశం లభిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.