దేశంలో ఎక్కడాలేని విధంగా అన్నదాతల కోసం వేదికలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు జడ్పీ ఛైర్ పర్సన్ సరిత. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని.. ఎల్కూర్, మల్లెందొడ్డి, విఠలాపురం గ్రామాల్లో ఏర్పాటైన రైతు వేదికలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రైతు వేదికల ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నారంటూ సరిత కొనియాడారు. అన్నదాతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి వేదికలు ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు. అందరూ ఒకే చోట కూర్చొని సమస్యలపై చర్చించుకోవాలని సూచించారు. కరోనా రెండో దశ నేపథ్యంలో.. ప్రతి ఒక్కరు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కోరారు. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కొవిడ్ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని