జోగులాంబ గద్వాల జిల్లా గంజిపేట కాలనీలో సుమారు పది రోజు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పేదల గుడిసెలు నీటితో నిండిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు తమ కాలనీవైపు ఒక్కరు కూడా చూడలేదని.. తమ అవస్థలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదని కాలనీవాసులు ఆరోపించారు. ఈ మేరకు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కాలనీవాసులు స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను.. గెలిచాక పట్టించుకోవట్లేదని ఐఎఫ్టయూ నాయకులు రాజు అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా అది పేపర్లకే పరిమితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలను ఇప్పటికైనా ఆదుకుని రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయాలని కాలనీవాసులతో కలిసి గద్వాల ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు.
ఇదీ చదవండిః 'డబుల్' ఇళ్ల జాప్యానికి చిత్తశుద్ధి లేకపోవడమే కారణం: కిషన్రెడ్డి