జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వైఎస్సార్ చౌక్ వద్ద రాజ్యాంగ పరిరక్షణ అఖిల పక్ష కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది పాల్గొన్నారు.
ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీ, సీఏఏ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని నాయకులు మండిపడ్డారు. భాజపా ప్రభుత్వం భారత దేశాన్ని చీల్చే ప్రయత్నంలో ఉందని ఆరోపించారు. వీలైనంత త్వరగా ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు కొనసాగుతాయి'