జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రం, జాతీయ రహదారి పక్కన పంటపొలాలు వరద ఉద్ధృతికి నీట మునిగిపోయాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి 5,80,000 క్యూసెక్కుల నీరు వస్తుండటం వల్ల నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశమున్నందున అధికారులు లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు.
వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో పర్యాటకులు నదీ తీరానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వారని నదీ తీరంలో వెళ్లనివ్వకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండిః డోభాల్ను ప్రశ్నించిన కశ్మీర్ గొర్రెల కాపరి