కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ-పాస్‌ను తప్పనిసరి చేశారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు మాత్రం ఈ-పాస్ నుంచి మినహాయింపు ఇచ్చారు. లాక్‌డౌన్ సడలింపు వేళల్లోనూ ఈ-పాస్ ఉన్నవారినే అనుమతిస్తున్నారు.
ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సడలింపు ఉందని వాహనదారులు భారీగా తరలిరావడంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ-పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ-పాస్‌లు లేని వాహనదారులను నిలిపివేస్తున్నారు. మరోవైపు సరుకు రవాణా వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి.