ETV Bharat / state

జూరాల ప్రాజెక్టుకు పెరుగుతోన్న వరద... 17 గేట్లు ఎత్తివేత - jurala 17 gates open

కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాలకు వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి 17 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

heavy-flooding-from-upper-projects-to-jurala-reservoir and 17 gates open
జూరాల ప్రాజెక్టుకు పెరుగుతోన్న వరద... 17 గేట్లు ఎత్తివేత
author img

By

Published : Aug 14, 2020, 8:50 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు లక్షా 58 వేల క్యూసెక్కులు వస్తోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 17 గేట్లు తెరిచి లక్షా 45 వేల 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1,045 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1,043 అడుగులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 9.657 టీఎంసీలకుగానూ... ప్రస్తుతం 8.611 టీఎంసీల నీటిని ప్రాజెక్టులో నిల్వ ఉంచారు. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు.

ఇవీ చూడండి: ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.