జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు 2 లక్షల 75 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండగా... 23 గేట్లు ఎత్తి 2 లక్షల 77 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా... ప్రస్తుతం 318.470 మీటర్లుగా ఉంది. పూర్తి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 9.562 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలవిద్యుత్తు, కుడి, ఎడమ కాలువలకు, నెట్టెంపాడు కోయిల్ సాగర్ సమాంతర కాలువ తదితర ఎత్తిపోతల పథకాలకు నీటిని పంపిస్తున్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ బడ్జెట్... రూ.1,46,492.3 కోట్లు