జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. కోయిలకొండ మండలం అంకిళ్లకు చెందిన 9 వ తరగతి చదువుతున్న అజయ్ కుమార్ మంగళవారం ఉదయం ఏడున్నర సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వెళ్లాడు. మళ్లీ తిరిగి పాఠశాలకు రాలేదు. 9 గంటల వరకు చూసిన ఉపాధ్యాయులు ఇంటికి ఫోన్ చేసి అడగ్గా.. అక్కడికి రాలేదని తెలిపారు. ఉపాధ్యాయులు, కుటుంబసభ్యులు నిన్నటి నుంచి వెతకసాగారు. చివరకు వసతి గృహం సమీపంలోని బావిలో చెప్పులు కనిపించాయి. బావిలో వెతగ్గా విద్యార్థి మృతదేహం లభించింది. బాలుడి మృతికి ప్రిన్సిపల్ నిర్లక్షమే కారణమని బంధువులు ఆందోళన చేశారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' దోషులకు ఉరి ఆలస్యం- జనవరి 7న నిర్ణయం!