కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడమే కాకుండా.. కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతోందని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. గద్వాల మండలం బీరెల్లి గ్రామంలో ఇంటింటికీ పిడికెడు బియ్యం కార్యక్రమం చేపట్టారు. ప్రతీ ఇంటి ముందుకు వెళ్లి పిడికెడు బియ్యం భిక్షాటన చేస్తూ.. నూతన చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు.
"ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతులను నాశనం చేసే చట్టాలు తీసుకురావడం సమంజసం కాదు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. రైతులకు అన్యాయం జరగకుండా ఎల్లవేళలా తెరాస ప్రభుత్వం అండగా ఉంటుంది''.
- బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , గద్వాల్ ఎమ్మెల్యే
ఇదీ చదవండి: టీఎన్జీవో పూర్తిగా విఫలమైంది: ఉద్యోగులు