అన్ని గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు నిర్మించాలని జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తడి, పొడి చెత్త షెడ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో పనుల్లో పురోగతి ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో అన్ని మండలాల ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
లాక్డౌన్తో ఉపాధి లేక ఇబ్బంది పడుతోన్న కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. హరిత హారంలో నాటిన మొక్కలు 85 శాతానికి మించి జీవించి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండలు తీవ్రతంగా ఉన్నందున నర్సరీలలో షెడ్ నెట్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు.