జోగులాంబ గద్వాల జిల్లాలోని కలెక్టరేట్ లో నాలుగు మున్సిపాలిటీలలో హరితహారం, నర్సరీలు, పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటుపై మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ శ్రుతి ఓఝా సమీక్షించారు. హరితహారంలో గద్వాల మున్సిపాలిటీ పరిధిలో 4.60 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మొక్కలు ఎక్కడెక్కడ నాటాలో ప్రణాళికలు సిద్ధం చాశారా అని ప్రశ్నించారు.
రోడ్డు ఎవెన్యూ కింద ఔటర్ రింగ్ రోడ్డు, గద్వాల ప్రధాన రహదారులు, పట్టణంలోని ప్రధాన రహదారుల్లో కలిపి 21 వేల మొక్కలు నాటేందుకు వచ్చే శనివారం లోపు గుంతలు తవ్వించటం, వాటికి కావలసిన ట్రీ గార్డులు, మొక్కలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జులై 13 నుంచి ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రారంభించేందుకు సిద్ధం చేసుకోవాలని సూచించారు. మియానాకి పార్కులు పట్టణంలో కనీసం 3 నుంచి 4 స్థలాల్లో భూమి చదును చేసి పెట్టాలని, ఆగస్టులో మియానాకి ప్లాంటేషన్ జరిగే విధంగా సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.
ప్రతి ఇంటికి తులసి మొక్కతోపాటు పండ్ల మొక్కలు ఇచ్చేవిధంగా నెలరోజుల్లో వాటిని సిద్ధం చేయాల్సిందిగా అటవీశాఖ, జిల్లా ఉద్యానవన అధికారిని ఆదేశించారు. డంపింగ్ యార్డు, డీఆర్‌సీ సెంటర్ వద్ద కనీసం 20 వేల మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. పట్టణంలో 7 కొత్త పార్కుల ఏర్పాటుకు గాను గుర్తించిన స్థలంలో మొక్కలను నాటే విధంగా చర్యలు చేపట్టాలని.. ఇందుకు ఉద్యానవన అధికారి, మున్సిపాలిటీ డీఈలు బాధ్యత వహించాలన్నారు.
ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ