భూ సమస్య పరిష్కరించడం లేదని జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి అనే రైతు భూ సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదని మనస్తాపం చెంది... పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఎస్సై గురుస్వామి, కార్యాలయ సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా... శాంతించాడు.
ఇవీ చూడండి: అగ్నిపరీక్షల నుంచి దేశానికి విముక్తి ఎప్పుడు?