ETV Bharat / state

గద్వాలలో ఫాస్ట్​ట్రాక్​ కోర్టును ప్రారంభించిన జస్టిస్​ ఆర్ఎస్ చౌహాన్ - telangana high court judge

జోగులాంబ గద్వాల జిల్లాలో ఫాస్ట్​ట్రాక్​ కోర్టును ఏర్పాటు చేశారు. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్​ చౌహాన్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసులకు సత్వర పరిష్కారం చూపాలని చౌహాన్​ సూచించారు.

fast track court arranged in jogulamba gadwal district started by judge rs chauhan
గద్వాలలో ఫాస్ట్​ట్రాక్​ కోర్టును ప్రారంభించిన జస్టిస్​ ఆర్ఎస్ చౌహాన్
author img

By

Published : Nov 5, 2020, 9:35 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో ఏర్పాటు చేసిన ఫాస్ట్​ట్రాక్‌ కోర్టును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, కలెక్టర్ శృతి ఓఝా పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో మెుత్తం 6 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మహిళలపై అత్యాచారాలు, పిల్లలపై లైంగిక దాడులు వంటి కేసులు సత్వర విచారణ జరపడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉపయోపడతాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి కేసులు దాదాపు 6,500 వరకు పెండింగ్​లో ఉన్నాయని.. అదృష్టవశాత్తు రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో కేవలం 97 కేసులు మాత్రమే పెండింగ్​లో ఉన్నట్లు జస్టిస్ ఆర్​ఎస్​ చౌహాన్​ వెల్లడించారు.

ఇదీ చదవండిః 'అదృశ్యం కేసులపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.