జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. తైబజార్ గుత్తేదారుడు అధిక రుసుం వసూలు చేస్తున్నాడంటూ కూరగాయలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. పురపాలక పరిధిలోని తైబజారు గేటు ఛార్జీలు ఇప్పటి వరకు రూ.20 నుంచి 25 వసూలు చేసేవారు. కానీ, ఇటీవల కొత్తగా వచ్చిన గుత్తేదారుడు గేటు ఛార్జీలు రెట్టింపు చేసినట్లు రైతులు వాపోయారు. ఇప్పటికే ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఉన్న తమను.. మార్కెట్లో దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సైతం గుత్తేదారులకే వత్తాసుపలుకుతున్నారని ఆరోపించారు. రోడ్డుపై రైతులు చేస్తున్న ఆందోళనకు చిరు వ్యాపారులు మద్దతివ్వటంతో ఆందోళన తీవ్రతరమైంది.
ఇదీ చూడండి: చేనేతమిత్రలో దళారుల చేతివాటం.. పక్కదారి పడుతున్న పథకం