ETV Bharat / state

seed mafia: రైతుల పాలిట శాపంగా విత్తన దందా.. ఆపేదెవరు? - తెలంగాణ వార్తలు

విత్తన దందా రైతుల పాలిట శాపంగా మారింది. వానాకాలం పంటల సీజన్ మొదలైందంటే చాలు.. ఎక్కడి నుంచో వస్తారు. పెద్దగా అలజడి లేకుండానే నకిలీ పత్తి విత్తనాలతో రూ.వేలకోట్లు దండుకుంటారు. ఏటా టాస్క్ ఫోర్స్ దాడుల్లో వందల క్వింటాళ్ల విత్తనాలు పట్టుబడుతున్నా.. బాధ్యులపై కేసులు నమోదవుతున్నా... ఈ విత్తన దందా మాత్రం ఆగడం లేదు. విత్తనచట్టంలోని లోపాలు, రాజకీయ పలుకుబడితో నకలీదందా పెచ్చుమీరుతోంది. ఈ మూఠాలకు అడ్డుకట్ట వేసేదెవరూ..? టాస్క్‌ఫోర్స్‌ పేరిట చేసే సోదాలు ఫలితాలు ఇవ్వట్లేదా...? వ్యవసాయ శాఖ ఈ సమస్యపై లోతుగా అధ్యయనం చేయట్లేదా..? ఖరీప్‌ సీజన్‌ రావడంతో మరోసారి ఇలాంటి ప్రశ్నలెన్నో తెర మీదకు వచ్చాయి.

Defective seeds, illegal seed mafia
విత్తన అక్రమ దందా, నాసిరకం విత్తనాల ముఠా
author img

By

Published : Jun 19, 2021, 7:38 PM IST

ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులను నకిలీ విత్తన కంపెనీలు నిండా ముంచుతున్నాయి. తక్కువ ధర, అవగాహన లోపంతో నాసిరకం విత్తనాలను అంటగడుతున్నాయి. విత్తన దందా తెలియని ఎంతోమంది అమాయక అన్నదాతలు నిండా మునిగాక లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయాలని వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులు ఈసారి పెద్దఎత్తున తెల్ల బంగారాన్ని సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ విత్తనాలతో రైతుల కష్టాన్ని గంగలో కలుపుతూ రూ.కోట్లలో విత్తన దందాలు కొల్లగొడుతున్నాయి.

కాలం చెల్లిన విత్తనాల విక్రయం

రాష్ట్రంలో పత్తి విత్తన వ్యాపారం రూ.వేలకోట్లలో సాగుతోంది. ఎకరాకు సగటున 2ప్యాకెట్ల విత్తనాలు చొప్పున రైతులు కొనుగోలు చేసినా... దాదాపు కోటీ 40లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. ఒక్కో ప్యాకెట్ ధర బహిరంగ మార్కెట్ లో రూ.600- 700 వరకూ పలుకుతోంది. అంటే దాదాపుగా రూ.వెయ్యి కోట్ల వరకు కొనుగోళ్లు జరుగుతాయి. ఈ అవసరాల్ని అవకాశంగా మలుచుకుంటున్నారు అక్రమార్కులు. జీవోటీ పరీక్షల్లో విఫలమైన విత్తనాలు, నాసిరకం, కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత బీటీ విత్తనాలు రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

నెల రోజుల్లో 90 కేసులు

నకిలీ విత్తనాల వ్యాపారం ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. వీటిని కట్టడి చేసేందుకు... రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టాస్క్ ఫోర్స్ దాడుల్లో పెద్దమొత్తంలో నకిలీ పత్తివిత్తనాలు పట్టుబడుతున్నాయి. వీటిలో 90శాతం పత్తివిత్తనాలే కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నెలరోజుల్లో టాస్క్​ఫోర్స్ చేసిన దాడుల్లో 90కి పైగా కేసులు నమోదయ్యాయి. రూ.కోటిన్నర పైచిలుకు విలువైన విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సరైన దస్త్రాలు లేనివి, కాలం చెల్లినవి, విడివిత్తనాలు, అనుమతిలేని విత్తనాలు అధికంగా ఉన్నాయి.

అవగాహన లోపం

పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మార్పు లేదు. అందుకు ప్రధాన కారణం చాలా మంది రైతులు పెట్టుబడుల కోసం వ్యాపారులపై ఆధారపడుతున్నారు. వారు ఏ విత్తనాలిస్తే వాటినే ప్రశ్నించకుండా తీసుకుంటున్నారు. అందులోనూ ఈ నకిలీ విత్తనాలు తక్కువ ధరలకే దొరుకుతుండటం... డబ్బులకు కాకుండా అరువుగా ఇవ్వడంతో వీటిని తీసుకునేందుకు కొందరు రైతులు మొగ్గు చూపుతున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి దిగుబడి రాక లబోదిబోమంటున్నారు. అక్రమ విత్తనాల వల్ల మోసపోయేది మారుమూల గ్రామాలకు చెందిన రైతులే. ఇలాంటి ప్రాంతాలపై అధికారుల నిఘా తక్కువగా ఉండటంతో అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఇక దళారులపై నమ్మకంతో దిగుబడి తక్కువ వచ్చినా పెద్దగా ఫిర్యాదులు రావడం లేదు. కొనుగోలు చేసిన విత్తనాలకు ఎలాంటి రశీదులు, ధ్రువపత్రాలు ఇవ్వకుండా దళారాలు ముందుగానే జాగ్రత్తపడుతున్నారు. రైతులు నష్టపోయినా ఎవరికి ఫిర్యాదు చేయలేని పరిస్థితి.

పర్యవేక్షణ లోపం

జోగులాంబ గద్వాల జిల్లాలో 11 కంపెనీలు విత్తనపత్తిని సాగు చేస్తుండగా కేవలం 6 కంపెనీలు మాత్రమే వ్యవసాయశాఖకు సమాచారం ఇచ్చాయి. సుమారు 38వేల మంది రైతులు 30 నుంచి 40వేల ఎకరాల విస్తీర్ణంలో విత్తనపత్తి సాగు చేస్తారు. ఏటా కోటిన్నరకు పైగా విత్తనప్యాకెట్లు నడిగడ్డ నుంచే ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ ఏటా రూ.వెయ్యికోట్ల వ్యాపారం సాగుతుంది. కాగా విఫల విత్తనాల సమచారం లేకపోగా... అవి ఎవరి దగ్గర ఉన్నాయి? వాటిని ఏం చేశారన్న దానిపైనా వ్యవసాయశాఖ పర్యవేక్షణ లేదు. విత్తనోత్పత్తి విషయంలో జాతీయస్థాయిలో ప్రభావం చూపే రంగంపై వ్యవసాయశాఖ పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటమే. రాష్ట్రంలో పత్తి విత్తనాల అక్రమ వ్యాపారానికి కారణమవుతోంది.

ఆరోపణలకు బలం

నిబంధనల ప్రకారం పత్తివిత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలు ఏ రైతువద్ద, ఎన్నిఎకరాల్లో, ఏ రకం విత్తనాన్ని సాగు చేస్తున్నాయో రాష్ట్ర వ్యవసాయశాఖకు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు ముందుగానే వివరాలు సమర్పించాలి. రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలకు జీవోటీ పరీక్షలు నిర్వహించి విఫలమైన విత్తనాలను తుక్కుగా మార్చి ఇవ్వాలి. కానీ కంపెనీలు ఆర్గనైజర్లకు తప్ప నేరుగా రైతులకు విత్తనాలు ఇవ్వడం లేదు. ఈ ఏడాది జోగులాంబ గద్వాల జిల్లాలో టాస్క్ ఫోర్స్ దాడుల్లో పట్టుబడిన విత్తనాలు 2019-20లో విఫలమైన విత్తనాలుగా గుర్తించామని వ్యవసాయశాఖ అధికారులు చెప్పడం ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.

అప్రమత్తత అవసరం

విత్తనాలు కొనుగోలు చేసే విషయంలో రైతులే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిని ఎక్కడ ఉత్పత్తి చేశారు? ఎక్కడ శుద్ధి చేశారు? జన్యుస్వచ్ఛత, మొలక శాతం, గడువు తేది, కంపెనీ వివరాలు రైతులు సరిచూసుకోవాలి. తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. వ్యాపారులు ఏ విత్తనాలిచ్చినా తీసుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విత్తన దందాపై దృష్టి సారించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఫౌండేషన్ విత్తనం ఇవ్వడం మొదలుకొని విఫల విత్తనాలు తిరిగి ఇవ్వడం వరకూ వ్యవసాయశాఖ పర్యవేక్షణ మరింత పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా రాష్ట్రవ్యాప్తంగా జరిగే దాడులతో పాటు విత్తనపత్తి సాగుపై నిరంతర పర్యవేక్షణ, అజమాయిషీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నకిలీ పత్తి విత్తనదందాకు అడ్డుకట్ట వేయవచ్చనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విత్తన దందాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి: BABY MURDER: పిల్లలు పుట్టలేదని పసివాడిని చంపేసింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.