ETV Bharat / state

పరిహారం చెల్లించాలంటూ పురుగుల మందు డబ్బాతో రైతు ఆందోళన - తుమ్మిళ్ల లిఫ్ట్​ ఇరిగేషన్​ వద్ద పురుగల మందు డబ్బాతో రైతు ఆందోళన

జోగులాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద పురుగుల మందు డబ్బాతో ఓ రైతు ఆందోళనకు దిగాడు. మూడు ఎకరాల పొలం తీసుకుని పరిహారం చెల్లించలేదంటూ ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

farmer-protest-with-insect-repellent-can-at-tummilla-lift-irrigation-in-jogulamba-gadwala
పరిహారం చెల్లించాలంటూ పురుగుల మందు డబ్బాతో రైతు ఆందోళన
author img

By

Published : Aug 30, 2020, 4:19 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకం ప్రారంభించింది. అయితే భూసేకరణలో భాగంగా మద్దిలేటి అనే రైతుకున్న మూడు ఎకరాల పొలాన్ని ప్రభుత్వం తీసుకుంది. కాగా దానికి సంబంధించి పరిహారం మాత్రం ఇంతవరకు ఇవ్వలేదు. ఉన్న పొలం పోయి చేసుకోవడానికి పనిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద అతను తన కుటుంబంతో కలిసి పురుగుల మందుతాగే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు పురుగుల మందు డబ్బా లాగేసి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

తనకు న్యాయం జరగకపోతే చావే గతని రైతు వాపోయాడు. గతంలో ఎకరాకు 7లక్షల 20వేల రూపాయలు పరిహారం ఇచ్చారని ఇప్పుడేమో రెండు లక్షల 70 వేల రూపాయలు ఇస్తామని అధికారులు అంటున్నారని తనకు పొలమే ఆధారమని మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్న పొలం లాగేసుకొని అన్యాయం చేస్తున్నారని వాపోయాడు. ప్రభుత్వం సాయం చేయాలని వేడుకొన్నాడు.

ఇదీ చదవండి: పెంపుడు జంతువుల కోసం మొబైల్ సెలూన్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.