ఆరేళ్లుగా తెరాస చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పడానికి నిదర్శనమే గద్వాలలోని ఆరో బ్రిడ్జి నిర్మాణమని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. జోగులాంబ జిల్లా గద్వాల పురపాలికలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీకి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. భాజపాను గెలిపిస్తే గద్వాలను స్మార్ట్ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు.