ETV Bharat / state

మొన్న పందుల పోటీలు... నేడు కుక్కల పరుగు పందేలు

Dog Racing: జాతరలు, పండుగల్లో కోడి పందేలు, ఎద్దులు బండలు లాగే పోటీలు చూసుంటాం. పొట్టేళ్ల పోటీలూ నిర్వహించడం తిలకించాం. కానీ అందుకు భిన్నంగా శునకాల పోటీలను నిర్వహించడం ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూడాలని ఆసక్తిగా ఉందా? అయితే ఆ ఊరిపై ఓ లుక్కేయండి....

'తిక్కవీరేశ్వర స్వామి ఉత్సవాల్లో ఆ పోటీలే ప్రత్యేకం'

author img

By

Published : Feb 24, 2022, 10:49 AM IST

'తిక్కవీరేశ్వర స్వామి ఉత్సవాల్లో ఆ పోటీలే ప్రత్యేకం'

Dog Racing: తెలుగు రాష్ట్రాల్లో ఉత్సవాల సమయంలో కోళ్లు, పొట్టేళ్ల పందేలు నిర్వహించటం పరిపాటి.. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇలాంటి వేడుకల వేళ వరాహాల కుస్తీ, శునకాల పరుగుపందెం పోటీలను జరుపుతారు. గద్వాల జిల్లా అయిజలోని తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన శునకాల పరుగుపందెం ఆకట్టుకుంది. ఓ యంత్రానికి ఇనుప తీగ చుట్టగా.. దానికి కట్టిన కుందేలు బొమ్మను వేటాడేందుకు శునకాలు పరుగులు పెట్టాయి. ఆలయ సమీపంలో నిర్వహించిన ఈ పోటీలను తిలకించేందుకు జనం పోటెత్తారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నుంచి యజమానులు శునకాలను తీసుకొచ్చారు. లాటరీ పద్ధతిలో రెండేసి చొప్పున మొత్తం 12 శునకాలు పోటీలో పాల్గొన్నాయి.. మొదటి బహుమతి రూ.15వేలు అయిజ మండలం రాజాపూర్‌ గ్రామవాసి నరేందర్‌కు చెందిన శునకానికి, రెండో బహుమతి రూ.10 వేలు కర్ణాటకలోని రాజోలిబండకు చెందిన స్వామి, మూడో బహుమతి రూ.8 వేలు అయిజ మండలం కుట్కనూరు వాసి విశ్వనాథ్‌కు చెందిన శునకాలు గెలుచుకున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.