ETV Bharat / state

రీ డిజైన్​ పేరుతో ప్రజాధనం వృథా: డీకే అరుణ - డీకే అరుణ

ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో ప్రజాధనాన్ని దోచుకునేందుకే తప్ప రైతులకు మేలు చేయాలనే ఆలోచన కేసీఆర్​కు లేదని భాజపా నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. నెట్టెంపాడు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

తుగ్లక్‌ పాలనకు నిదర్శనం కేసీఆర్‌: డీకే అరుణ
author img

By

Published : Aug 4, 2019, 8:35 PM IST

జోగుళాంబ గద్వాల జిల్లా జూరాల, నెట్టంపాడు ప్రాజెక్టులను మాజీ మంత్రి డీకే అరుణ సందర్శించారు. కేసీఆర్​కు కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని విమర్శించారు. గడచిన ఐదేళ్లలో నెట్టంపాడు కింద పనులను ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆరోపించారు. పాలమూరు -రంగారెడ్డి డిజైన్ మార్చడం వల్ల జిల్లా ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. రీ డిజైన్ పేరుతో ముఖ్యమంత్రి వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా అభివృద్ధికి నోచుకోవడం లేదని వెల్లడించారు. ఇకనైనా తుగ్లక్ పాలన మానుకొని... రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

తుగ్లక్‌ పాలనకు నిదర్శనం కేసీఆర్‌: డీకే అరుణ

ఇవీచూడండి: మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. 9మంది మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.