గద్వాల నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని ఆరోపించారు భాజపా నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ. తాను గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులే తప్పా కొత్తగా ఏ అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా భాజపా కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ప్రజలంతా భాజపాకు మద్దతు పలకాలని ఆమె కోరారు. భారతీయ జనతా పార్టీ గద్వాల మున్సిపాలిటీ ఇంఛార్జిగా మాజీ శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస్ రెడ్డిని నియమించినట్లు తెలిపారు.
ఇదీ చదవండిః ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన విజయారెడ్డి అంత్యక్రియలు