ETV Bharat / state

'మట్టి విలువ తెలుసుకోండి... మమ్మల్ని ఆదుకోండి' - no demand for clay pots

'ప్లాస్టిక్​ వాడకాలు తగ్గిద్దాం' అంటున్న కేంద్రం మట్టి వాడకాలను ప్రోత్సాహించడంలో విఫలమవుతోంది. పూర్వీకుల నుంచి వాడకంలోకి వచ్చిన మట్టి పాత్రలు కనుమరుగై... పండుగ సమయంలో అలంకరించే వస్తువులుగా మాత్రమే మిగిలిపోయాయి. సమాజానికి నాగరికతను పరిచయం చేసిన కుమ్మర్లు నేడు ఆధునిక ప్రపంచంతో పోటీపడలేక తనువు చాలిస్తున్నారు.

'మట్టి విలువ తెలుసుకోండి... మమ్మల్ని ఆదుకోండి'
author img

By

Published : Oct 26, 2019, 4:05 PM IST

'మట్టి విలువ తెలుసుకోండి... మమ్మల్ని ఆదుకోండి'

జోగులాంబ గద్వాల జిల్లా అరగిద్ద గ్రామం... మట్టి పాత్రలకు పెట్టింది పేరు. అనాధిగా వస్తున్న కులవృత్తిని నమ్ముకుని జీవనాన్ని కొనసాగిస్తున్న గ్రామం అది. కుండలు తయారు చేయడం తప్ప మరో ఇతర పనులు తెలియని అమాయకపు కుటుంబాలు కొలువుదీరిన ప్రదేశం. ఒకప్పడు మట్టిని నమ్ముకుని రారాజుల్లా బతికిన కుటుంబాలు... నేటి ఆధునిక ప్రపంచంలోని ప్లాస్టిక్, అల్యూమినియం మహమ్మారితో సమిధలుగా మారుతున్నాయి.
ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలకు అలవాటు పడిన ప్రజలు మట్టి పాత్రల వాడకాన్ని మరింత తగ్గించడంతో కుమ్మర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. తమ వృత్తిని వదులుకోకుండా దీపావళికి ప్రమిదలు... ఎండకాలంలో చల్లని కుండలు... చేసుకుంటూ వచ్చే అరకొర సొమ్ముతో జీవనం సాగిస్తున్నారు.
ప్లాస్టిక్ వాడకాలు తగ్గించమంటున్న ప్రభుత్వం తమకు సరైన అవకాశాలు ఇవ్వట్లేదని వాపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆధునిక పరిజ్ఞానం అందజేసి నూతన శైలిలో కుండలు తయారు చేసే యంత్రాలను ఇవ్వాలని... సరైన మార్కెట్ చూపి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
మట్టి కుండలో పెరుగు, మట్టి పాత్రల్లో వంటలు, వేసవిలో దాహార్తిని తీర్చే చల్లని కుండలు, దీపావళికి వెలుగులు నింపే ప్రమిదలు వాడిన పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉండేవారో చెప్పనవసరం లేదు. ప్లాస్టిక్ వాడుతూ పర్యవరణాన్ని కలుషితం చేస్తూ... అనారోగ్యాలకు గురవుతున్న మనమే వాటి విలువ తెలుసుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాటిని తయారు చేసే వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ఈ పండుగకు అందరూ సహకరించాలని ఈటీవీ భారత్ కోరుకుంటోంది.

ఇవీ చూడండి: పాలిచ్చి పెంచిన తల్లే యాసిడ్ తాగించి చంపేసింది!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.