ఎనమిదో రోజు పుష్కరాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏడు రోజులుగా పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. అలంపూర్, రాజోలి, పుల్లూరు, వేణు సోంపురాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. ఏడు రోజులపాటు కళకళలాడిన పుష్కర ఘాట్లు... తుపాను ప్రభావంతో వెలవెలబోతున్నాయి.
నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వల్ల అత్యల్ప సంఖ్యలో భక్తులు వచ్చారు. వర్షంలోనే భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి... స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నదీమ తల్లికి అర్చకులు నిత్య హారతులిచ్చారు. పుల్లూరు, అలంపూర్ పుష్కర ఘాట్లలో భద్రత ఏర్పాట్లను ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పర్యవేక్షించారు.
వివిధ పుష్కరఘాట్లలో భక్తుల సంఖ్య...
అలంపూర్ - 7790మంది
పుల్లూరు- 1556మంది
రాజోలి-1639
వేణిసొంపురం- 668మంది
ఇదీ చదవండి: వైభవంగా కొనసాగుతున్న తుంగభద్ర నది పుష్కరాలు