ETV Bharat / state

జోగులాంబ గద్వాలలో మరో 10 కరోనా కేసులు

author img

By

Published : Apr 24, 2020, 5:39 AM IST

​ జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా వైరస్విజృంభిస్తోంది. తాజా హెల్త్​ బులెటిన్​ ప్రకారం మరో 10 పాజిటివ్​ కేసులు నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 42కు చేరింది.

కరోనా
కరోనా

జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో మరో 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 10 కేసుల్లో ఏడు గద్వాల పట్టణానికి చెందినవి కాగా... రెండు అయిజ, ఒకటి ఆలంపూర్ మండలంలో నమోదైంది. మొత్తం 42 కేసుల్లో 29 కేసులు గద్వాల పట్టణంలోనే నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

జిల్లాలో 570 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 502 మందికి కరోనా లేదని తేలింది. మరో 30 మంది ఫలితాలు తేలాల్సి ఉంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారి రొనాల్డ్ రోస్ జిల్లాలో పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. కంటైన్ మెంట్ జోన్లలో కట్టడి, అనుమానితుల గుర్తింపు, క్వారంటైన్ చేసే విధానంపై జిల్లా అధికారులకు కీలక సూచనలు చేశారు. మహబూబ్​నగర్​, నారాయణపేట, నాగర్​కర్నూల్​ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

ఇదీ చూడండి: 'ఆర్థిక సాయం చేయకుంటే.. కరోనాపై విజయమెలా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.