కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలుగా మారాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. అమాయక రైతుల నోట్లో మట్టి కొట్టి కేంద్ర ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలకు వత్తాసు పలుకుతోందని దుయ్యబట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సంపత్ కుమార్ అన్నారు. రైతుల పాలిట వరంలా మారుతామన్నారు.
ఇదీ చూడండి: గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం